Published On: Sun, Jun 28th, 2020

ఇంద్ర‌కీలాద్రిపై సూర్యో‌పాస‌న సేవ‌…

ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో లోక సంర‌క్ష‌ణార్థం సూర్యోపాస‌న సేవ‌ను ఆదివారం సంద‌ర్భంగా ఉద‌యం అర్చ‌‌కులు శాస్త్రోక్త‌కంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జరిగిన శ్రీచక్రనవావరణార్చన సేవ, లక్ష కుంకుమార్చన సేవ, శాంతి కళ్యాణం, చండీహోమం కార్యక్రమాల్లో పరిమిత సంఖ్యలో ఆన్‌లైన్ టైం స్లాట్ పద్ధతిలో టిక్కెట్లు పొందిన భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. అమ్మ‌ల‌గన్న అమ్మ జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మను దర్శించుకున్నారు. అనంతరం భక్తులు స్వయంగా కొబ్బరికాయలు సమర్పించారు. ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

Just In...