Published On: Tue, Apr 9th, 2019

ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు హామీపై ఐసిఐఎఫ్ హర్షం

* వడ్డీ రహిత బ్యాంకింగ్ విధానం ఇస్లామిక్ బ్యాంక్‌తో సాధ్యమ‌ని వెల్ల‌డి

* అధికమవనున్న విదేశీ పెట్టుబడులు

* ఐసిఐఎఫ్ ప్రధాన కార్యదర్శి అబ్ధుర్ రఖీబ్ వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: రాష్ట్రంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటును తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చడంపై ఇండియన్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ ఫైనాన్సు ప్రధాన కార్యదర్శి అబ్దర్ రఖీబ్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఒక హోటల్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను ఆహ్వనిస్తున్నాయని చెప్పారు. ఈ అంశాన్ని గుర్తించిన సఎం చంద్రబాబు నాయుడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు అంశాన్ని టిడిపి మ్యానిఫెస్టోలో చేర్చారని చెప్పారు. మైనార్టీలతో పాటు పేద వర్గాల అభ్యున్నతిపై దృష్టి పెట్టిన చంద్రబబాబు ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే పేదలకు ఆర్ధికంగా అండగా ఉంటే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుకు ముందడుగేశార‌ని  తెలిపారు. ఇస్లామిక్ బ్యాంక్ కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితమైంది కాదన్నారు. పేద ప్రజలు ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉంటే కోట్లాది మంది కార్మికులకు, చిరు వ్యాపారులకు, రైతులు అనేక వర్గాల వారికి ఈ బ్యాంక్ సేవలందించనుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని అభినందించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న బ్యాంకింక్ వ్యవస్థ వల్ల ధనిక వర్గానికి మాత్రమే మేలు జరుగుతుందని, వడ్డీలేని రహిత బ్యాకింగ్ విధానమైన ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుతో పేద, బడుగు, బలహీన వర్గాలకు బ్యాంక్ సేవలు మరింత విస్తృతం అవుతాయని చెప్పారు. 2008లో రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో ప్లానింగ్ కమిషన్ బ్యాంకింగ్ సంస్కరణలపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ (సిఎఫ్ఎస్ఆర్) బ్యాంకింగ్ రంగంలో సమికృత, సృజనాత్మక అభివృద్ధి కొరకు ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరిందన్నారు. ఆర్బీఐ ఏర్పాటు చేసిన రాజేష్ వర్మ నేతృత్వంలోని ఇంటర్ డిపార్టుమెంటల్ కమిటీ, దీపక్ మొహంతి నేతృత్వంలోని మీడియం టరమ్ పాత్ ఫైనాన్షియల్ ఇన్క్యూజన్ కమిటీలో వడ్డీ రహిత బ్యాంకింగ్ వ్యవస్థను సిపార్సు చేశాయన్నారు. ఈ విధానం కేవలం ముస్లిం దేశాలకే పరిమితం కాలేదని,  యునైటెడ్ కింగ్ డమ్, జర్మనీ, లక్సెంబర్గు, ప్రాన్సు తదితర దేశాలలో ఇస్లామిక్ బ్యాంక్ ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ వ్యవస్థగా అమలులో ఉందని తెలిపారు. మౌలిక సదుపాయాల రంగంలో రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడంలో ఖ్యాతి గడించిన ఆస్థి ఆధారిత ఇస్లామిక్ బ్యాకింగ్ ప్రాడెక్టు అయిన సుకుక్ కు ఐఎంఎఫ్, వరల్డు బ్యాంక్ ఆమోదం లభించిందని చెప్పారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే సౌది అరేబియా, అబుదాబి, ఇతర దేశాలు మన దేశంలో పెట్టబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గల్ఫు కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. లండన్, టోక్యో, పారిస్, లక్సెంబర్గు, హాంకాంగ్ లు ఇస్లామిక్ బ్యాంకింగ్ కేంద్రాలుగా మారినప్పుడు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లు ఎందుకు మారకూడదని ఆయన ప్రశ్రించారు.

Just In...