Published On: Tue, Jun 12th, 2018

ఈవీఎంలపై అప్రమత్తంగా ఉండండి

* తెదేపా స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని, దానిపట్ల పార్టీ శ్రేణులు అంద‌రూ పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఉండ‌వ‌ల్లిలోని ప్రజాదర్బార్‌ హాలులో నిర్వహించిన తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఈవీఎంల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పార్టీ క్యాడర్‌ను సైతం అప్రమత్తం చేయాలని సీఎంను కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా దుర్వినియోగం చేయటం సులభతరం అన్నారు. ఈవీఎంల దుర్వినియోగానికి అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాన్ని సీరియస్‌గా ఆలోచించాలని నేతలకు సూచించారు. భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్  బూత్‌ కమిటీల నిర్వహణపై మాట్లాడుతూ 55 శాతం బూత్‌ కమిటీలు ఇప్పటికే ఖరారయ్యాయని, మిగిలిన చోట్లా జిల్లా యంత్రాంగం వేగంగా ఖరారు చేయాలన్నారు. బూత్‌లవారీగా ఓటరు లిస్ట్‌పైనా జిల్లా నేతలు పూర్తి పట్టు సాధించాలని లోకేష్‌ సూచించారు.

Just In...