Published On: Sat, Oct 12th, 2019

ఈశాన్య రాష్ట్రాల్లో త‌గ్గుతున్న జీఎస్టీ రిట‌ర్న్‌ల ఫైలింగ్ న‌మోదు

* జిఎస్టి వసూలులో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగించని రీతిలో చ‌ర్య‌లు

* వివిధ రాష్ట్రాల సీఎస్‌ల‌తో వీసీలో జిఎస్టిపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రమోద్‌కుమార్ మిశ్రా

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వస్తుసేవల పన్ను విధానం(జిఎస్టి) అంశాలపై శుక్రవారం ఢిల్లీ నుండి ప్రధానమంత్రి ముఖ‌్య కార్యదర్శి ప్రమోద్‌కుమార్ మిశ్రా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యర్శులతో వీడియో సమావేశం (వీసీ) నిర్వహించారు. ఈ సందర్భంగా మిశ్రా జిఎస్టీ రిటర్న్‌ల‌ ఫైలింగ్‌లో పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది లేకుండా చూడడం వంటి పలు అంశాలపై సిఎస్‌లతో చర్చించారు. గడ‌చిన నాలుగేళ్ళుగా దేశవ్యాప్తంగా జిఎస్టి అమలుచేస్తుండగా ఈ ఏడాది గత రెండు మూడు క్వార్టర్ల నుండి జిఎస్టి వసూలు తగ్గడం జరిగిందని తెలిపారు. ఈ పరిస్థితులను అధిగ‌మించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సిఎస్‌లకు ప్రమోద్‌కుమార్ మిశ్రా వివరించారు. జిఎస్టి రిటర్న్‌ల ఫైలింగ్ ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా ఉందని మిశ్రా పేర్కొన్నారు. జిఎస్టి వసూలులో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగించని రీతిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిఎస్టికి సంబంధించిన పలు అంశాలపై ప్రమోద్‌కుమార్ మిశ్రా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవన్యూ మరియు ఎక్సైజ్ సాంబశివరావు, చీఫ్ కమీషనర్ ఆఫ్ జిఎస్టి పియూష్ కుమార్, ప్రిన్సిపల్ కమీషనర్ జిఎస్టి మరియు కస్టమ్స్ ఎస్.ఫహీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Just In...