Published On: Wed, Oct 21st, 2020

ఈ ఏడాది ఆన్‌లైన్‌లోనే ఇంటర్‌ ప్రవేశాలు

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: ఈ ఏడాది ఇంటర్మీయట్ ప్రవేశాలు ఆన్‌లైన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు సెక్రటరీ వి.రామకృష్ణ మంగళవారం విజయవాడలో తెలిపారు. బుధ‌వారం నుంచి ఆన్‌లైన్‌లో  ఇంటర్మీయట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా ఈ నెల 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కాగా రెండేళ్ళ ఇంటర్మీయట్ రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 18002749868 టోల్ ఫ్రీ నంబరు సంప్ర‌దించాల‌ని రామకృష్ణ పేర్కొన్నారు.

 

Just In...