Published On: Mon, Nov 5th, 2018

ఈ నెల 11న నేషనల్ మైనారిటీస్ వెల్ఫేర్ డే

* కడపలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం హాజ‌రు

* మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎండీ హిదాయత్ వెల్లడి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: నాలుగున్నర సంవత్సరాల టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 11వ తేదీన జాతీయ మైనారిటీ సంక్షేమదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎండీ హిదాయత్ సచివాలయంలోని ప‌బ్లిసిటీ సెల్‌లో సోమ‌వారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో వెల్లడించారు. నవంబర్ 11న ఉదయం 10 గంటలకు కడపలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారని హిదాయత్ మీడియాకు తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగున్నర సంవత్సరాల్లో ముస్లిం మైనారిటీలకు టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున బడ్జెట్ లో నిధులు కేటాయించి, ఖర్చు చేసి అనేక సంక్షేమ, అభివృద్ధి  కార్యక్రమాలు చేపట్టిందని హిదాయత్ గుర్తు చేశారు. తద్వారా మైనారిటీలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని తెలిపారు. మైనారిటీస్ వెల్ఫేర్ డేలో అందరూ పాల్గొనాలని హిదాయత్ పిలుపునిచ్చారు.

Just In...