Published On: Sun, Aug 9th, 2020

ఈ నెల 11న సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియ‌మితులైన సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 11న (మంగళవారం) జరుగుతుంద‌ని విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అఖిల భారత ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్, అఖిల భారత సంఘటన సహా కార్యదర్శి సతీష్ జీ పాల్గొంటార‌ని పేర్కొన్నారు. సభాస్థలి పరిశీలనలో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర ఉన్న ది వెన్యూ ఫంక్షన్ హాల్‌ను పరిశీలించారు. ఈ పరిశీలనకు రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్‌ఛార్జ్ సునిల్ దియోదర్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, పాకలపాటి సన్యాసిరాజు, అడ్డురి శ్రీరామ్, పాలూరి శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు.

 

Just In...