Published On: Tue, Feb 5th, 2019

ఈ నెల 12న ఎస్టీ సాధ‌న కోసం వాల్మీకి, బోయ‌లతో ఛ‌లో ఢిల్లీ

* మంత్రి కాల‌వ శ్రీనివాసులు పిలుపు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని వాల్మీకి, బోయ‌ల‌ను ఎస్టీ జాబితాలో చేర్చ‌డానికి స‌త్వ‌రం కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్‌తో ఈ నెల 12న ఢిల్లీలో ధ‌ర్నా నిర్వ‌హిస్తామ‌ని రాష్ట్ర స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీ‌నివాసులు ప్ర‌కటించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న చేశారు. అత్యంత ప్రాచీన గిరిజ‌న తెగ‌గా ఎప్ప‌టి నుంచో ఆధారాలున్నా, వాల్మీకి, బోయ‌లు నేటికీ గిరిజ‌నులుగా గుర్తింపు పొంద‌కపోవ‌డం విచార‌క‌మ‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని వాల్మీకి, బోయ‌ల సామాజిక‌, ఆర్ధిక స్థితిగ‌తుల‌పై ప్రొఫెస‌ర్ స‌త్య‌పాల్ క‌మిటీ చేత అధ్య‌య‌నం చేయించింద‌న్నారు. అత్యంత శాస్త్రీయంగా, స‌మ‌గ్రంగా జ‌రిగిన ఈ అధ్య‌య‌నం వ‌ల్ల వాల్మీకి, బోయ‌లు అట‌వీ తెగ‌ల్లో ఒక‌ర‌ని తేలిపోయింద‌న్నారు. త‌రువాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ప‌లు జిల్లాల్లో వీరి స్థితిగ‌తుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించింద‌న్నారు. వాటి ఆధారంగా రాష్ట్ర కేబినెట్‌లో ఈ స‌మ‌స్య‌ను చ‌ర్చించి సానుకూల నిర్ణ‌యం సానుకూల నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. అనంత‌రం స్వ‌యంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వాల్మీకి, బోయ‌ల‌ను ఎస్టీ జాబితాలో చేర్చాల‌ని కోరుతూ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టి ఏక‌గ్రీవంగా ఆమోదించ‌డం చారిత్రాత్మ‌క‌మ‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపి 14 నెల‌లు గ‌డుస్తున్నా నేటికీ దీనిపై కేంద్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. ఈ నేప‌ధ్యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 12న ఢిల్లీలో ధ‌ర్నా నిర్వ‌హించడానికి వాల్మీకి సంఘాల నాయ‌కులు నిర్ణ‌యించార‌న్నారు. కార్య‌క్ర‌మంలో వాల్మీకి, బోయ‌లు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొనాల‌ని మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు పిలుపునిచ్చారు.

Just In...