Published On: Sat, Sep 9th, 2017

ఈ నెల 12న సంస్థాగ‌త ఎన్నిక‌ల స‌మీక్ష‌

* ఏపీసీసీ విస్త్ర‌త‌స్థాయి కార్య‌వ‌ర్గ స‌మావేశం

* మాజీ కేంద్ర మంత్రి కె.హెచ్‌.మునియ‌ప్ప ఆధ్వ‌ర్యంలో సంస్థాగ‌త ఎన్నిక‌ల స‌మీక్ష

* దిగ్విజ‌య్‌సింగ్ ఆధ్వ‌ర్యంలో ఏపిసిసి విస్త్ర‌త‌స్థాయి కార్య‌వ‌ర్గ స‌మావేశం

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ఎన్ ర‌ఘువీరారెడ్డి వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ్యవ‌హ‌రాల ఇన్‌చార్జ్ దిగ్విజ‌య్ సింగ్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర కార్య‌వ‌ర్గం స‌మావేశాన్ని ఈ నెల 12న విజ‌య‌వాడ‌లోని ఏపిసిసి రాష్ట్ర కార్యాల‌యంలో నిర్వ‌హిసున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ఎన్.ర‌ఘువీరారెడ్డి తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 10 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాజీ కేంద్ర మంత్రి కె.హెచ్. మునియ‌ప్ప ఆధ్వ‌ర్యంలో సంస్థాగ‌త ఎన్నిక‌ల స‌మీక్ష కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్రమానికి ప్ర‌దేశ్ రిట‌ర్నింగ్ అధికారి (పిఆర్వో), మ‌రియు ఏపిఆర్వోలు, బ్లాక్ క‌మిటీ అధ్య‌క్షులు, బూత్ క‌మిటీ అద్య‌క్షులు, డిఆర్వోలు పాల్గొంటారని పేర్కొన్నారు. అనంత‌రం 11 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ్యవ‌హ‌రాల ఇన్‌చార్జీ దిగ్విజ‌య్ సింగ్ ఎం.పి ఆధ్వ‌ర్యంలో ఏపిసిసి విస్త్ర‌త‌స్థాయి కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

congress_17-08-17_1

Just In...