Published On: Fri, Feb 8th, 2019

ఈ నెల 13 నుండి శ్రీగోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు

సెల్ఐటి న్యూస్‌, తిరుప‌తి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఈ నెల 13నుండి 19వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. 13న శ్రీ కోదండరామస్వామివారు 5 చుట్లు, 14న శ్రీ పార్థసారథిస్వామివారు 5 చుట్లు, 15న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు 5 చుట్లు, 16న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు 5 చుట్లు, 17, 18, 19 తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు 7 చుట్లు ఉంటాయ‌న్నారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Just In...