Published On: Mon, Feb 10th, 2020

ఈ నెల 15న అమరావతిలో పవన్ పర్యటన

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాజధాని అమరావతిలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అమరావతి రైతులను కలిసి ఉద్యమానికి పవన్‌ మద్దతు తెలపనున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి జనసేన తరుపున మద్దతు తెలిపి ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

Just In...