Published On: Wed, Nov 6th, 2019

ఈ నెల 19న ఏపీ ఎన్జీవోస్ సంఘం నగర శాఖ ఎన్నికలు

* 12న నామినేషన్ల స్వీకరణ

* నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారి రమేష్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నగరశాఖకు సంబంధించి ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని 12న నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల అధికారి పి.రమేష్ బుధ‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శాఖకు సంబంధించి ఒక అధ్యక్ష, ఒక సహధ్యక్ష, నాలుగు ఉపాధ్యక్ష పదవులతో పాటు ఒక కార్యదర్శి, ఒక కార్యనిర్వాహక కార్యదర్శి, నాలుగు సంయుక్త కార్యదర్శులు, ఒక మహిళా కార్యదర్శి, ఒక కోశాధికారి, మూడు డిఇసి మెంబ‌ర్ పదవులకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఈ నెల 12వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2:30ని నుంచి సాయంత్రం 5.30ని వరకు ఏపీ ఎన్జీవో హోం గాంధీనగర్ నందు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు నామినేషన్లు పరిశీలించి అర్హత గల అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. రాత్రి 8 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించడం జరిగిందన్నారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని ఒక్కొక్క పోస్టుకు ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లయితే 19వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గాంధీ నగర్ లోని ఎన్జీవో హోం నందు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఓట్లు లెక్కించి గెలిచిన అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని అన్నారు. నామినేషన్ల దరఖాస్తుకు ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క పదవికి రూ.300 దరావత్తు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. నగర శాఖలో సభ్యత్వం కలిగిన ఎవరైనా ఎన్నికలలో పోటీ చేయవచ్చునని తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ సహధ్యక్షుడు ఎం.రాజుబాబు, పర్యవేక్షకునిగా ఆర్.హెచ్.ప్రకాష్‌ వ్యవహరిస్తారని ఎన్నికల అధికారి రమేష్ తెలిపారు.

Just In...