Published On: Sat, Apr 21st, 2018

ఈ నెల 23న ఏపీసీఎస్సీఓసీ ప్రారంభం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో సైబర్ నేరాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీ -2017ను గతేడాది అమల్లోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఏపీసీఎస్సీఓసీ)ను ఈ నెల 23న సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసం సమీపంలో ఉండవల్లిలోని కరకట్టవద్ద ఉన్న గ్రీవెన్స్ హాలులో ప్రారంభించనున్నారని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి శుక్ర‌వారం ఒక ప్రకటనలో తెలిపారు.

Just In...