ఈ నెల 26 నుండి సౌత్ ఇండియా అడ్వకేట్స్ క్రికెట్ టోర్నమెంట్
* మూలపాడు స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహణ
* తలపడనున్న ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక జట్లు
* ఏపీఏసీఏ అధ్యక్షుడు బి.సురేష్‌కుమార్ వెల్లడి
విజయవాడ స్పోర్ట్స్, సెల్ఐటి న్యూస్: ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ నెల 26 నుండి మూడు రోజుల పాటు సౌత్ ఇండియా అడ్వకేట్స్ క్రికెట్ టోర్నమెంట్ జరగనున్నట్లు ఏపీఏసీఏ అధ్యక్షుడు బి.సురేష్‌కుమార్ తెలిపారు. గవర్నరుపేటలోని ఓ హోటల్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. మూలపాడు క్రికెట్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకటక జట్లు తలబడనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో కేరళ జట్టు పాల్గొవడం లేదన్నారు. 28వ తేదీ ఉదయం 8గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని దీనికి ముఖ్య అతిధిగా హైకోర్టు సిజె అరుప్‌కుమార్ గోస్వామి హాజరై ప్రారంభిస్తారన్నారు. ఈ క్రమంలోనే ముగింపు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారని తెలిపారు. తొలుత టోర్నమెంట్‌కు చెందిన గోడపత్రికను ఆవిష్కరించారు. 26, 27 తేదీల్లో లీగ్ మ్యాయ్లు జరుగుతాయని వీటిలో టాప్ రెండు టీమ్‌లు ఫైనల్స్‌లో తలబడతాయన్నారు. 28వ తేదీ సౌత్ ఇండియా అడ్వకేట్స్ క్రికెట్ టోర్నమెంట్ షిప్ ఫైనల్స్ జరుగుతాయన్నారు. 3, 4 స్థానంలో నిలిచిన టీమ్‌లు ప్లేటు చాంపియన్ షిప్ ఆడతారని అన్నారు. విలేకరుల సమావేశంలో ఏపీ టీమ్ కెప్టెన్ దుబ్బా క్రాంతికుమార్, కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ డి.ఈశ్వరబాబు, ఏపీఏస్పీ వైస్ ప్రెసిడెంట్ బాజీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరుపున పాల్గొనే ప్లేయర్లు డి. క్రాంతికుమార్ (కెప్టెన్), సి.హెచ్.సతీష్ (వైస్ కెప్టెన్), సి.హెచ్.చంద్రశేఖర్‌రెడ్డి (కీపర్),పి.సురేష్‌కుమార్, ఎ.రామాంజనేయులు, పి.మణిథర్, యశ్వంత్ కిరణ్‌కుమార్, ఎస్.డి.అర్షద్, ఎస్.అశోక్,కె.నవీన్‌కుమార్, శ్రీకృష్ణ , అచెం నాయుడు, విజయ్‌నాయుడు, లక్ష్మీకాంత్, రాజ్‌కుమార్, చక్రవర్తి, లక్ష్మణ్, మురళీకృష్ణ, గోపికృష్ణ, గోవిందరావు (చీఫ్ కోచ్), జి.సునీలు కాంత్‌కుమార్, జోకా విజయ్‌కుమార్ (మేనేజర్లు)లు ఉన్నారు.