Published On: Tue, Sep 25th, 2018

ఈ నెల 30న ఫాస్- అక్కినేని 2018 అవార్డుల బ‌హుక‌ర‌ణ‌

* ప్ర‌ముఖ సినీ న‌టుడు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డికి జీవిత‌సాఫ‌ల్య పుర‌స్కారం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ద‌శాబ్ధాలుగా తెలుగు చ‌ల‌న‌చిత్ర సీమ‌కు అవార్డుల‌ను అంద‌జేస్తున్న ఫిలిం ఎన‌లిటిక‌ల్ అండ్ అప్రిసియేష‌న్ సొసైటీ (ఫాస్) ఆధ్వ‌ర్యంలో ఫాస్- అక్కినేని 2018 అవార్డుల‌ను ఈ ఏడాది కూడా సినీ, టీవీ, రంగ‌స్థ‌ల‌, సాంస్క్ర‌తిక‌, సేవా రంగాల‌కు చెందిన ప‌లువురికి బ‌హుక‌రించ‌నున్న‌ట్లు ఫాస్ ఫిలిం సొసైటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె.ధ‌ర్మారావు, ఫెస్టివ‌ల్ ఛైర్మ‌న్ డోగిప‌ర్తి శంక‌ర‌రావు, వి.వి.కె.న‌ర‌సింహ‌రావులు తెలిపారు. సోమ‌వారం ఉద‌యం పాత‌బ‌స్తీ బ్ర‌హ్మాణ వీధిలోని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రీ అన్న‌దాన స‌త్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఫాస్- అక్కినేని 2018 అవార్డుల బ‌హుక‌ర‌ణ‌కు సంబంధించిన బ్రోచ‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఫాస్ ఫిలిం సొసైటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె.ధ‌ర్మారావు, ఫెస్టివ‌ల్ ఛైర్మ‌న్ డోగిప‌ర్తి శంక‌ర‌రావు, వి.వి.కె.న‌ర‌సింహ‌రావులు మాట్లాడుతూ ఈ నెల 30న న‌గ‌రంలోని గాంధీన‌గ‌ర్‌లో ఉన్న వెలిదండ్ల హ‌నుమంత‌రాయ గ్రంథాల‌యం ఆడిటోరియంలో సాయంత్రం 5 గంట‌ల‌కు ఫాస్- అక్కినేని 2018 అవార్డులను బ‌హుక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఫాస్‌- అక్కినేని 2018 జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం (లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు)ను ఈ ఏడాది ప్ర‌ముఖ సినీ న‌టుడు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డికి, ప్ర‌తిభా పుర‌స్కారాన్ని సినీన‌టుడు సంపూర్ణేష్‌బాబుకు, ప్ర‌త్యేక అవార్డును సినీ న‌టుడు మాణిక్‌ల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. అలాగే ఉత్త‌మ రంగ‌స్థ‌ల న‌టుడుగా నాయుడు గోపీతో పాటు వివిధ రంగాల‌కు చెందిన మొత్తం 13 మందికి అవార్డుల‌ను అంద‌జేయ‌నున్నామ‌ని పేర్కొన్నారు. అవార్డుల‌ బ‌హుక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో అతిథులుగా న‌గ‌ర మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మ‌న్ వ‌ర్ల రామ‌య్య పాల్గొంటార‌ని తెలిపారు. అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో భాగంగా ప్ర‌ముఖ గాయ‌ని స‌ప్త‌స్వ‌ర‌మాధురి ల‌లితారావు బృందంచే అక్కినేని సినీ గీత ల‌హ‌రి సంగీత కార్య‌క్ర‌మాన్ని కూడా నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. విలేక‌రుల స‌మావేశంలో ఫాస్ ఫిలిం సొసైటీ స‌భ్యులు ప‌లువురు పాల్గొన్నారు.

Just In...