Published On: Mon, Aug 5th, 2019

ఈ నెల 8న కియా కొత్త కారు ‘సెల్తోస్‌’ విడుదల

* ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కియా కంపెనీ, హాజరుకానున్న సీఎం

* అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో కార్యక్రమం

సెల్ఐటి న్యూస్, అమరావతి: ఈ నెల 8న మధ్యాహ్నం కియా కంపెనీ తన కొత్తకారు ‘‘సెల్తోస్‌’’ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి నివాసంలో కంపెనీ ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేవ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ ముఖ్యమంత్రి జగన్ ని కలిసి కొత్త కారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటుద్వారా ఉత్పత్తిచేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. ప్రస్తుతం టర్కీ, స్లొవేకియాలకు ఇంజిన్లను కూడా ఎగుమతి చేస్తామన్నారు. కియా కొత్త కారు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ హాజరవుతున్నారు.

Just In...