Published On: Thu, Apr 11th, 2019

ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు..

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి గురువారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.. ఓటు వేశారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లందరూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఓటు హ‌క్కు వినియోగించుకున్నవారిలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి, కొడుకు, కోడ‌లు నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి ఉన్నారు.

Just In...