Published On: Sat, Feb 22nd, 2020

ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం

* కృష్ణా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్ వెల్ల‌డి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఉగాది నాటికి అర్హులైన పేదలకు 2లక్షల 71వేల పైబడి ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు అందించేందుకు కృష్ణా జిల్లాలో పనులు చురుకుగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాయంలో జిల్లా కలెక్టర్ ఏ.యండి ఇంతియాజ్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్.యం. ధ్యానచంద్రలతో కలసి ఆయ‌న విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో లేఅవుట్ పనులు, ప్లాటులు విభజన ఇతర మౌలిక‌ సదుపాయల పనులను చేపడుతున్నమని మార్చి 25 ఉగాది నాటికి పట్టాలను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. జిల్లాలో 53 మండలలు 2 మున్సిపల్ కార్పోరేషన్లో 7 మున్సిపాల్టీలు నగర పంచాయితీల పరిధిలో గుర్తించడం జరిగిందన్నారు. సుమారు 2లక్షల 71వేల పైబడి లబ్దిదారులను గుర్తించామని, గ్రామ పరిధిలో 1.5 సెంట్లు, పట్టణ‌ ప్రాంతాల్లో 1 సెంటు భూమి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. జి+3 భవనాలను టిడ్కో ద్వారా చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే ఇళ్ల కోసం చెల్లింపులు చేసిన అర్హత గల లబ్దిదారులకు పంపిణి చేస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ నవరత్నల భాగంగా ఇళ్లు లేని కుటుంబలకు అర్హత మేరకు పంపిణి చేసేందుకు 4వేల 570 ఎకరాల భూమి అవసరం ఉందని అందులో 2వేల 498 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించామని ఇతర మార్గాల ద్వారా మరో 2వేల ఎకరాలు గుర్తించమన్నారు. వీటన్నిటికి లేఅవుట్లు చేయడం జరుగుతుందన్నారు. రాళ్ళు వేయడం, చదును చేయడం, అనుసంధాన రహదారుల నిర్మాణం వంటి పనులు చేయడం జరుగుతుందన్నారు. 1409 లేఅవుట్ లో 1120 లేఅవుట్ పనులు పూర్తి చేశామన్నారు వీటిలో 310 లేఅవుట్ లకు సంబంధించి మార్కింగ్, ప్లాటేషన్ పూర్తి చేశామన్నారు. నిరంతరం జాయింట్ కలెక్టర్ , సబ్ కలెక్టర్లు ఆడీఓలు తో కలసి నిరంతరం పర్యవేక్షిస్తున్నానని అన్నారు. ఒక యజ్ఞంల అర్హులైన పేదలందరికి సొంత ఇంటిని అందించే ప్రభుత్వం ప్రకటించిన నవరత్నల అమలకు పనిచేస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఇందుకోసం నా జ్యూడిషయల్ స్టాపు పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసి 5 సంవత్సరల తరువాత లబ్దిదారులకు అమ్ముకోనే హుక్కును కూడా ప్రభుత్వం కలగజేస్తున్నదన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా తహశీల్దారులకు సంబంధిత అధికారులకు ఎగ్జిక్యూట్ చేసే ప్రత్యేక అధికారులనుకూడా ప్రభుత్వ కలుగజేసిందన్నారు. జిల్లాలో 24వేల మంది వాలంటీరిలు పనిచేస్తున్నారని తెలిపారు. వీరి ద్వారా స్థానికంగా పనులు పూర్తి అవుతున్నాయని తెలిపారు.

Just In...