Published On: Wed, Jul 21st, 2021

ఉచిత రేషన్ బియ్యం పంపిణీ త్వ‌రిత‌గ‌తిన జ‌ర‌గాలి

* రేషన్ దుకాణాల‌ను తనిఖీ చేసిన స‌బ్‌క‌లెక్ట‌ర్ సూర్య‌సాయి ప్ర‌వీణ్‌చంద్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా అందజేస్తున్న బియ్యం పంపిణీ తీరును విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ పరిశీలించారు. బుధవారం నగరంలోని 1, 2 సర్కిల్స్ పరిధిలోని పలు రేషన్ దుకాణాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మొగల్రాజ‌పురం, చిట్టినగర్‌లోని రేషన్ దుకాణాల్లో ఈ-పోస్ మిషన్లు పనితీరును,  బియ్యం నాణ్యతను పరిశీలించారు. సర్వర్లు స్లోగా ఉండడం కార‌ణంగా మంగళవారం బియ్యం పంపిణీలో ఎదురైన సమస్యలను పలువురు డీలర్లు సబ్ కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం బియ్యం పంపిణీ సాఫీగా సాగుతున్నట్లు వారు తెలిపారు. ఉచిత బియ్యాన్ని త్వరితగతిన పంపిణీ జరిగేలా చూడాలని డీలర్లకు సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ చెప్పారు. కార్య‌క్ర‌మంలో పౌర సరఫరాల అధికారులు ఎం.మాధురి(ప‌శ్చిమ తహ‌శీల్ధార్‌), కోమ‌లి ప‌ద్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...