Published On: Wed, Dec 4th, 2019

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

* వరల్డ్ డిజెబిలిటీ డే సందర్భంగా అను హాస్పిటల్స్‌లో ఉచిత వైద్య శిబిరం

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: వరల్డ్ డిజెబిలిటీ డే సందర్భంగా సూర్యారావుపేటలోని అను హాస్పిటల్స్ నందు మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఈ ప్రత్యేక శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పుట్టుకతో అంగవైకల్యం కలవారు, చేయి వంకర, కాలు వంకర, సెలిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స చేసి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు అను హాస్పిటల్స్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గానాగరాజు తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులైన చిన్నారులకు చికిత్సనందించి, వారు సంతోషంగా జీవనం సాగించేలా చేస్తున్నామని డాక్టర్ దుర్గానాగరాజు వెల్లడించారు. అను హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి.రమేష్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా తాము అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. వరల్డ్ డిజెబిలిటీ డే సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీడియాట్రిషియన్ డాక్టర్ శ్వేత, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నటరాజ్, ఫిజియోథెరపిస్టు డాక్టర్ రమ్య తదితరులు పాల్గొన్నారు.

Just In...