Published On: Fri, Aug 14th, 2020

ఉద‌యానంద ఆసుప‌త్రిని ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్స్‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ‌క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట్లాడుతూ ఆసుపత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. హాస్పిటల్‌ డైరెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. నంద్యాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యాంప్‌ కార్యాలయంలో హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...