Published On: Fri, Jul 31st, 2020

ఉపరాష్ట్రపతిని కలిసిన సోము వీర్రాజు

న్యూఢిల్లీ, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును ప్రకటించిన తర్వాత తొలిసారి శుక్రవారం ఢిల్లీలో
పర్యటించారు. పర్యటనలో భాగంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్‌ సంతోష్‌, రాంమాధవ్‌లను కలిసి కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర నాయకత్వానికి సోము వీర్రాజు వివరించారు.

 

Just In...