Published On: Thu, Feb 7th, 2019

ఉపాధ్యాయ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన అడారి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఉద్యోగ భద్రతకు ప్ర‌తిబంధ‌కంగా ప‌రిణ‌మించిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ  రాష్ట్రంలోని ఉపాధ్యాయులు నిర్వ‌హించిన ఛ‌లో అసెంబ్లీ కార్య‌క్ర‌మానికి ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్య‌ర్ధి అడారి కిషోర్‌కుమార్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కొంతకాలంగా ఉపాధ్యాయులు త‌మ‌ ఆత్మ గౌరవంగా భావిస్తున్న పింఛ‌న్ కోసం పోరాటం చేస్తుండ‌గా దానికి సంబంధించి అసెంబ్లీలో చ‌ర్చ‌కు డిమాండ్ చేస్తూ గురువారం వీరు అమ‌రావ‌తి వేదిక‌గా అసెంబ్లీని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకుని అడారి త‌దిత‌ర ఉపాధ్యాయ నాయ‌కుల‌ను అరెస్టు చేసి తొలుత ప‌మిడిముక్క‌ల‌, త‌దుప‌రి ఉయ్యూరు పోలీస్ స్టేష‌న్‌ల‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కు అయిన పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేయాల‌ని, అప్పుడే ఇక్కడ ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లాభం చేకూరుతుందని తెలిపారు. ఉద్యోగ భద్రత,  పింఛ‌న్ అనేది వారి కుటుంబాలకి సంబంధించిన అంశమని, ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  అభ్య‌ర్ధిగా తాను ఎల్ల‌వేళ‌లా ఉపాధ్యాయులకు సహాయ సహకారం అందిస్తాన‌ని అడారి ప్ర‌క‌టించారు. ఉపాధ్యాయిల హ‌క్కుల సాధ‌న‌లో భాగంగా జ‌రిగే సభలు సమావేశాలకు వెళ్లి సంఘీభావం తెలుపుతూ స‌మ‌స్య‌ల‌ సాధ‌న త‌న‌వంతు పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. అవసరమైతే  ప్ర‌భుత్వం పెన్షన్‌ రెగ్యులేషన్ అథారిటీకి లేఖ‌ రాసి రాష్ట్ర ఖజానాకు అక్క‌డి కార్పస్ ఫండ్ తీసుకు రాగలిగితే అది మన ఉపాధ్యాయులందరికీ  మేలు చేకూర్చు తుంద‌ని ఆడారి తెలిపారు. తాను అరెస్టు కావ‌ట‌మే కాకుండా అరెస్టయిన ఉపాధ్యాయులందరినీ పోలీసులు అయా స్టేష‌న్‌ల‌కు త‌ర‌లించ‌గా వారిని ప‌రామ‌ర్శించిన అడారి, ఛ‌లో అసెంబ్లీ నేప‌ద్యంలో పోలీసులు ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యలు స‌రికాద‌న్న విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు.
 

Just In...