Published On: Fri, Feb 8th, 2019

ఉర్ధూ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఘ‌నంగా జాకీర్ హుస్సేన్ జ‌యంతి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 123వ జయంతి వేడుకలు 17వ డివిజన్ లబ్బీపేటలోని మహమ్మద్ నగర్ నగరపాలక సంస్థ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో శుక్ర‌వారం ఘ‌నంగా జరిగాయి. కార్యక్రమానికి అధ్య‌క్ష‌త వ‌హించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్.ఎస్.ఇమామ్ బాషా మాట్లాడుతూ జాకీర్ హుస్సేన్ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత అనేక పదవులు నిర్వహించారని అన్నారు. పాఠశాల విద్యా కమిటీ సలహాదారు, ప్రముఖ న్యాయవాది మహమ్మద్ ముఖ్తియార్ ఆలీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ.. జాకీర్ హుస్సేన్ అనేక రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించి ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను అధిష్టించి దేశానికి అనేక సేవలను అందించారని కొనియాడారు. గౌరవ అతిధిగా విచ్చేసిన వి.మీడియా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ అలీమ్ మాట్లాడుతూ జాకీర్ హుస్సేన్ ముస్లింలలో మొట్ట మొదటి రాష్ట్రపతిగా ఎన్నికై, రాష్ట్రపతిగా ఉంటూ చనిపోయారని తెలిపారు. ఈ సందర్భంగా ఉర్దూ, తెలుగు మరియు అంగన్వాడీల విద్యార్థులకు పలకలు, బిస్కట్లు, చాక్లెట్లును ముఖ్తియార్, అబ్దుల్ అలీంలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మదర్ థెరిస్సా స్కూల్ హెచ్.ఎమ్. సి.హెచ్.శారదాదేవీ, ఉపాధ్యాయులు ఎన్.శ్రీకాంత్, వి.ప్రమీలారాణీ, ఉర్దూ డి.ఐ., రికార్డ్ అసిస్టెంట్ అబ్దుల్ జబ్బార్, అంగన్వాడీ కార్యకర్త ఎన్.ఆశాలత జ్యోతి, తల్లిదండ్రులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Just In...