Published On: Sat, Sep 9th, 2017

ఉల్లి ధరల పతనంపై స్పందించిన ప్రభుత్వం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: పతనమవుతోన్న ఉల్లి ధరలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టన్ను ఉల్లిని రూ.6 వేలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించనుంది. ఈ సంద‌ర్భంగా ఉల్లిధరల పతనంపై మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం ధర బాగానే ఉందన్నారు. ప్రస్తుతం కొత్త పంట రాగానే ధర పడిపోయిందన్నారు. టన్ను ధర కనిష్టంగా రూ.4 వేలుకు పోతున్నట్లు వెల్లడించారు.

onions_2

Just In...