Published On: Sat, Jun 29th, 2019

ఉషారామ ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: తేలప్రోలుకు సమీపంలోని ఉషారామ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయస్థాయి ఉన్నత విద్యాధికార సంస్థ ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి) నుండి స్వీయప్రతిపత్తి (అటానమస్) హోదా లభించింది. గత నెలలో యుజిసికి సంబంధించిన తనిఖీ బృందం కళాశాలను సందర్శించి, హోదా మంజూరు సంబంధించి ఆఖరిదశ ప్రత్యక్ష తనిఖీలను నిర్వహించింది. వీరి నివేదిక అనంతరం యుజీసీ కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు స్వీయప్రతిపత్తి (అటానమస్) హోదా మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్ట‌ర్ .జీవీకేయస్‌వి ప్రసాద్ తెలిపారు. కళాశాల అటానమస్ స్థాయికి రావడానికి కారణమైన అధ్యాపక బృందాన్ని, వారికి నాయకత్వం వహించిన డైరెక్టరు డా. కె.రాజశేఖరరావును కళాశాల ఛైర్మన్ సుంకర రామబ్రహ్మం, కరస్పాండెంట్ అనిల్ సుంకర, వైస్ చైర్మన్ అరుణ్ లంకాలు అభినందించారు. స్వీయప్రతిపత్తి (అటానమస్) హోదా వలన కళాశాల తన నిర్వహించే కోర్సుల సిలబస్, పరీక్షా విధానం తదితరాలలో యుజీసీ నిబంధనలకు లోబడి సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. స్థానిక పరిస్థితులకు, పారిశ్రామిక అవసరాలక‌నుగుణంగా వివిధ కోర్సులలో సబ్జెక్టులను చేర్చి, ఆయా కోర్సులను విద్యార్థుల ఉపాధికి మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దవచ్చు.

ఉషారామ ఇంజినీరింగ్ కళాశాల – విశేషాలు…
* సుంకర రామబ్రహ్మం అధ్యక్షతన 2008లో స్థాపించిన ఉషారామ ఇంజినీరింగ్ కళాశాల విద్యాబోధనలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తోంది.
* 2013లో ఐఎస్ఓ ధ్రువీకరణను, 2016లో నాక్-ఏ గ్రేడును, 2018లో జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ (జేఎన్.టీయూ, కాకినాడ) పర్మినెంట్ అఫియేషన్ పొందింది.
* ఐబీఎం, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటి ప్రముఖ సంస్థలతో శిక్షణకు సంబంధించిన అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విలువైన సర్టిఫికేషన్ కోర్సులు, వారి ఇంజినీరింగ్ చదువుతో పాటు ఉచితంగా అందిస్తున్నాము.
* విద్యార్థులకు మొదటి ఏడాది నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ సాఫ్ట్ స్కిల్స్ లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాము.
* క్లాసురూముకూ, ఉద్యోగానికీ మధ్య గల అంతరాన్ని తగ్గించడానికి ప్రత్యేకంగా ‘వర్క్ స్టడీ’, ‘స్పెషల్ టీం’ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము. దీని వల్ల గత కొన్ని సంవత్సరాలుగా మా విద్యార్థులు 90శాతం ప్లేస్‌మెంటు సాధించగలుగుతున్నారు.
* ఈ ఏడాది నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విద్యార్థులకు ప్రత్యేకంగా USA కి చెందిన TIEC ఆమోదం పొందిన ‘స్మార్ట్ సిటీ ట్రైనింగ్ ప్రోగ్రాం’లో శిక్షణ ఇవ్వబడుతుంది. > ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చేరబోయే విద్యార్థులకు (ఏ కళాశాలలో చేరేవారైనా సరే) ఉపయోగపడేలా జులై1 నుంచి ఉషారామ కళాశాలలో ‘బ్రిడి’ కోర్సు నిర్వహిస్తున్నాము. అందరికీ ఉచితంగా అందిస్తున్న ఈ బ్రిడ్జి కోర్సును విద్యార్థులంతా వినియోగించుకోవాలని కోరడమైనది.

Just In...