Published On: Sat, Apr 20th, 2019

ఎంసెట్‌ కోడ్‌ విడుదల..

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్‌:  ఐదేళ్ల నుంచి జేఎన్టీయూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంసెట్ నిర్వహిస్తోందని ఎంసెట్ ఛైర్మన్ రామలింగరాజు వెల్లడించారు. శ‌నివారం ఉద‌యం కాకినాడ జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజుతో కలసి మొదటి రోజు ఇంజినీరింగ్ పరీక్ష సెట్ కోడ్ విడుదల చేశారు. ఉదయం పరీక్ష సెట్ కోడ్ ఈజీ-02, మధ్యాహ్నం పరీక్ష సెట్ కోడ్ ఈజీ-18ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ నెల 23న ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీ, ఈ నెల 24న వ్యవసాయ, వైద్య విభాగం పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. మే రెండో వారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తామని రామలింగరాజు చెప్పారు. ఇంజినీరింగ్ పరీక్ష ఒక్కో సెషన్‌లో 29వేల మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నట్లు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంసెట్ కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Just In...