Published On: Thu, Feb 6th, 2020

ఎక్కడ రైతు నష్టపోయినా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

* అగ్రి మిషన్‌పై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సమీక్షా సమావేశం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఎక్కడ రైతు నష్టపోయినా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల‌ని అందుకోసం సరైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. అగ్రి మిషన్‌పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల కొనుగోలు బుకింగ్‌ చేసుకునే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, కొడాలి నాని, సీఎస్‌ తదితరులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవటానికి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టిక ఉంచాల‌న్నారు. ప్రకటించిన ధరలకన్నా తక్కువకు కొనుగోలు చేస్తే వెంటనే ప్రభుత్వం జోక్యంచేసుకోవాల‌ని ఆదేశించారు. ఎక్కడ రైతు నష్టపోయినా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల‌ని అందుకోసం సరైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. రైతులనుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాలవద్ద సరిపడా సిబ్బందిని పెట్టాలి. ప్రస్తుతం శెనగలు, కందులు మార్కెట్లోకి వస్తున్నాయి. కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూడాలి. పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరల రేట్లను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచండి. అలాగే కొనుగోలు కేంద్రాల వివరాలు కూడా గ్రామ సచివాలయాల్లో ఉంచాలి. వారానికోసారి కచ్చితంగా సమావేశం పెట్టుకుని రైతులకు అందుతున్న ధరలపై సమీక్ష చేయండి. నాలుగు వారాలకోసారి నాతో సమావేశం కండి. ఇది ప్రాధాన్యతతో కూడుకున్న కార్యక్రమం. అలసత్వం జరిగితే రైతుకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతుల్లో చైతన్యం తీసుకు రండి. కొనుగోలు కేంద్రాల్లో పంటను కొన్న తర్వాత డబ్బులు వెంటనే అందేలా చూడాలి. వచ్చే నెలకల్లా పరిస్థితిలో మొత్తం మార్పులు రావాలి. లేదంటే సంబంధిత అధికారులను కచ్చితంగా బాధ్యుల్ని చేస్తాను. రైతుకు కచ్చితంగా కనీస మద్దతు ధరలు రావాలి. పంటను అమ్ముకునే సమయంలో రైతులకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదు. ఈ కీలక అంశాలను అధికారులు సవాల్‌గా తీసుకుని పనిచేయాలి. ఈ క్రమంలో ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదన్న సీఎం. శ్రీకాకుళంలో గోడౌన్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకొచ్చిన మిషన్‌ సభ్యులు దీనిపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. కొత్త గోదాముల నిర్మాణం జరిగేంతవరకూ ప్రత్యామ్నాయాలు చూడాలన్న సీఎం. సరిపడా గోదాములు, కోల్డ్‌స్టోరేజీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గోదాముల, కోల్డ్‌ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాలను ఓన్‌ చేసుకోవాలి. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలి. పశుసంవర్థకం, హార్టికల్చర్, ఫిషరీస్‌ రంగాలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొత్త ఊపు ఇవ్వాలి. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలి. ఎరువులు, విత్తనాల కంపెనీలను నుంచి మంచి సానుకూల స్పందన ఉందన్న అధికారులు ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపట్ల సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.
రైతు భరోసా కేంద్రాలు ఈకంపెనీలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయన్న అధికారులు
ఆమేరకు ధరలు తగ్గించి ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు
రైతు భరోసా కేంద్రాలు కచ్చితంగా వినూత్న విధానాలకు దారితీస్తాయన్న అధికారులు

రైతులు నాణ్యమైన విత్తనాలను కోరుకుంటున్నారు :సీఎం
వాటిని అందించడానికి దృష్టిపెట్టాలి: సీఎం
విత్తన కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా చూడాలి: సీఎం

పశువులకు వైద్యం అందిస్తున్న విధానాలపై సీఎం దృష్టి
మందులు వాడకుండా పాలు ఉత్పత్తిచేసే వారిని పోత్సహించాలన్న సీఎం
అలాంటి పాలకు గిట్టు బాటు ధరలు మరింత పెంచాలన్న సీఎం
ఆర్గానిక్‌ మిల్క్‌ పేరిట ఈ పాలను అమ్మేందుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం
అన్ని పశువులకూ ట్యాగ్‌ వేయాలన్న సీఎం

నకిలీ విత్తనాల కేసులను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశం
వ్యవసాయ శాఖలోనే లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు
యూనివర్శిటీ సిఫార్సులు ప్రకారం బెంగాల్‌ గ్రామ్‌ విత్తనాలను పూర్తిస్థాయిలో సప్లై చేస్తున్నామన్న అధికారులు

 

Just In...