Published On: Fri, Jan 11th, 2019

ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ అద్భుతంగా న‌టించారు

* సినీ న‌టుడు బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్‌ను అభినందించిన సీఎం చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఎన్టీఆర్ చిత్ర కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడిని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును బాలకృష్ణ, క్రిష్ క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా గురువారం రాత్రి బెంజిసర్కిల్‌లో ఉన్న ట్రెండ్‌సెట్ మాల్‌లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను వీక్షించిన సీఎం చంద్రబాబు, బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో అద్భుతంగా నటించారని ప్ర‌శంసించారు. ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించి మహానటుడి జీవితాన్ని, త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రాన్ని రూపొందించార‌ని పేర్కొంటూ దర్శకుడు క్రిష్‌ను సీఎం చంద్ర‌బాబు అభినందించారు.

Just In...