Published On: Fri, Oct 19th, 2018

ఎన్డీ తివారి మృతిప‌ట్ల ర‌ఘువీరారెడ్డి సంతాపం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి మృతికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి సంతాపం, వారి క‌టుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఏపిసిసి రాష్ట్ర కార్యాల‌యం నుంచి శుక్ర‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తివారీ మూడు పర్యాయాలు పని చేశార‌ని, ఒకసారి ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలను నిర్వహించార‌ని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా పని చేసిన ఆయ‌న 2007 ఆగస్టు 22 నుంచి 2009 డిసెంబర్ 26 వరకు ఏపీ గవర్నర్‌గా వ్యవహరించార‌ని తెలిపారు. అటువంటి గొప్ప వ్య‌క్తి మృతి చెంద‌డం త‌న‌ను క‌ల‌చివేసింద‌న్నారు.

Just In...