Published On: Wed, Apr 10th, 2019

ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు

* పోలింగ్ జరిగే మండలాల్లో “144వ సెక్షన్” మరియు సెక్షన్ 30 సిటీ పోలీస్ యాక్ట్‌లు

* విజ‌య‌వాడ సీపీ ద్వారకా తిరుమ‌ల‌రావు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: నగర పోలీస్ కమీషనరేట్ ప‌రిధిలో గురువారం జ‌ర‌గ‌నున్న సార్వత్రిక ఎన్నికలు నేప‌ధ్యంలో విధి నిర్వ‌హ‌ణ‌కు వ‌చ్చిన పోలీస్ సిబ్బందికిగాని, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ఆటంకాలు క‌లిగించే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు మాట్లాడుతూ ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌మీష‌న‌రేట్‌లో చేప‌ట్టిన నిబంధ‌న‌లు వివ‌రించారు.
* విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ 2 లోక్‌స‌భ‌, 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. మొత్తం 539 పోలింగ్ కేంద్రాలలో 1588 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయబడినవి 207 సాధరణ, 332 సమస్యాత్మక పోలింగ్ సెంటర్లుగా గుర్తించడం జరిగింది.
* ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు, పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ ఓటు హక్కును ఎలాంటి ఇబ్బంది లేదా అడ్డంకి లేకుండా పూర్తి స్వేచ్చతో నిర్భయంగా వినియోగించు కోవటానికి అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రజాశాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది.
* ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 11న పోలింగ్ జరిగే మండలాల్లో “144వ సెక్షన్” మరియు సెక్షన్ 30 సిటి పోలిస్ యాక్ట్ లను విధించడమైనది. 144వ సెక్షన్’ అమలులో వున్న సమయంలో పోలింగ్ బూత్లకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకుమించి ఎక్కువ మంది జనం గుమిగూడరాదు, కర్రలు, మారణాయుధాలు, పేలుడుకు సంబంధించిన ఏదైనా ఆయుధాలు మరియు రాళ్ళు వంటి వాటిని పట్టుకు తిరగరాదు.
* ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా అనగా ది. 09.04.2019న సాయంత్రం 6 గంటల నుండి ది.11.04.2019 సాయంత్రం 6 గంటల వరకు విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలి. లేకుంటే సంబంధింత మద్యం దుకాణ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు ఎన్నికల రోజున పాఠశాలలు గాని, కళాశాలలుగాని, వ్యాపార సంస్థలుగాని తెరచి ఉంచరాదు.
* ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. లోక్సభ అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలకు గస్తీ నిర్వహణకు 158 మొబైల్ పార్టీలను నియమించడంతో పాటు ఆయా మండలాల్లో 7 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను 45 స్టైకింగ్ ఫోర్స్లను కేటాయించడం జరిగింది. అదే విధంగా ప్లయింగ్ స్క్వాడ్, ఎస్.ఎస్.టి. (స్టాటిక్ సర్వెలెన్స్) మరియు ఎం.సి.సి. (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) టీమ్లను ఏర్పాటు చేయడం జరిగింది
* ఎన్నికల బందోబస్తు 1) పోలింగ్ బూత్ల వద్ద, 2) పోలింగ్ కేంద్రాల వద్ద, 3) మొబైల్ పార్టీలు, 4) శాంతి బద్రతల పికేట్లు, 5) ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 6) స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, 7) స్ట్రైకింగ్ ఫోర్స్లు, 8) ఎస్.ఎస్.టి. (స్టాటిక్ సర్వెలెన్స్) 9) ఎం.సి.సి. (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) టీమ్లను మరియు విజయవాడకు వచ్చు అన్నిరోడ్లలో చెక్ పోస్ట్లను పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది.
* ప్రతి ఒక్క యస్. హెచ్.ఓకు, ఎ.సి.పిలకు సాయుధ పోలీసు బలగాలతో పాటుగా కేంద్ర బలగాలు టీమ్‌ల‌ను ఏర్పరచి వారికి నిర్దేశించిన ప్రదేశాలలో శాంతిభద్రతల నిమిత్తం నియమింపబడ్డారు. అధికారుల అన్ని మొబైల్ ఫోన్ నంబర్లకు (అండ్రాయిడ్) సౌకర్యము కల్పించబడింది మరియు వి. హెచ్.యఫ్ కమ్యునికేషన్ నిమిత్తం ప్రతిఒక్క అధికారికి, బాడీ కెమారాలు, మ్యాన్ పాక్ సెట్లు మరియు వారి వాహానాలకు మైక్లను అమర్చబడినవి.
* ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అవాంతరాలు ఏర్పడకుండా, సామాన్య ప్రజా జీవనానికి విఘాతం కలుగకుండా ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా కమీషనరేట్ పరిధిలో రౌడీషీట్లు మరియు సస్ఫెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులు, గత ఎన్నికల్లో కేసులు నమోదైన వ్యక్తులు మరియు ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆస్కారమున్న వ్యక్తులను మొత్తం 1449 మందిని బైండోవర్ చేయడంతో పాటు అయుధ లైసెన్స్లు కలిగి ఉన్న వ్యక్తుల నుండి 376 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా 66 మద్యం కేసులలో రూ. 2722.92 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై 391 కేసులు నమోదు చేయడం జరిగింది.
* ఇందులో 69 కేసులలో ప్రజలకు వివిధ రకాలుగా డబ్బు మరియు వస్తు పంపిణీ చేసేవారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అంతే కాకుండా 44 కేసులలో రూ.2,43,96,415 అనధికార నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎన్నికల సందర్భంగా కమీషనరేట్ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలు, కాలనీలు, ఎన్నికలు జరిగే ప్రాంతాలలో వాహనాల తనిఖీలతో పాటు ఇతర ప్రాంతాల వాళ్ళు తలదాచుకొని ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు తనిఖీలు నిర్వహించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ క్ర‌మంలో ఎన్నికల రోజున ఆయా నియమ నిబంధనలు వివిధ పార్టీల అభ్యర్ధులు, నాయకులు, పోలింగ్ బూత్ ఏజెంట్లు మరియు ప్రజలు పాటించాలని, పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Just In...