Published On: Tue, Mar 12th, 2019

ఎన్నిక‌ల నిబంధ‌నావ‌ళికి అనుగుణంగానే అయా శాఖ‌ల న‌డ‌వ‌డిక‌

* రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి గోపాల‌కృష్ణ ద్వివేది

* అబ్కారీ శాఖ గోడ ప‌త్రిక‌ను ఆవిష్క‌ర‌ణ‌, టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ విడుద‌ల

* రెండు మూడు రోజుల్లో రాష్ట్ర స్దాయి కంట్రోల్ రూమ్: ఎంకె మీనా

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సార్వ‌త్రిక ఎన్నికల సమ‌ర్ధ నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రిస్తూ అబ్కారీ శాఖ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు అనుస‌ర‌ణీయ‌మ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి గోపాల‌కృష్ణ ద్వివేది అన్నారు. ఎన్నికల కోడ్ అమ‌లులోకి వ‌చ్చిన నేప‌ధ్యంలో ప్ర‌తి శాఖ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవ‌ల‌సిందేన‌న్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో పోలీసు శాఖ త‌దుప‌రి, అబ్కారీ విభాగం కీల‌క భూమికను పోషించాల్సి ఉంటుంద‌ని ఆ క్ర‌మంలో ఆ శాఖ ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌తో స‌మాయ‌త్తం కావ‌టం ముదావం అన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని మ‌ధ్య నిషేధ‌ము, అబ్కారీ శాఖ రూపొందించిన గోడ‌ప‌త్రిక‌లు, చేతి ప‌త్రిక‌ల‌ను మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ద్వివేదీ అవిష్క‌రించారు. ఈ నేప‌ధ్యంలో మ‌ధ్య‌నిషేధ‌ము, అబ్కారీ శాఖ క‌మీష‌న‌ర్ ముఖేష్‌కుమార్ మీనా, గోడ ప‌త్రికలో తీర్చిదిద్దిన స‌మాచారం గురించి ద్వివేదికి వివ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్దాయి నుండి రాష్ట్ర స్దాయి వ‌ర‌కు అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, బ‌స్ స్టేష‌న్లు, జ‌న‌స‌మ‌ర్ధ ప్ర‌దేశాల‌లో విస్తృత ప్ర‌చారం క‌లిగించే విధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. పెద్ద ఎత్తున బ్యాన‌ర్లు, హోర్డింగ్‌లు కూడా ఏర్పాటు చేయ‌నున్నామ‌ని మీనా పేర్కొన్నారు. మ‌ద్యం ప్ర‌భావానికి లోనై ఓటు హ‌క్కును దుర్వినియోగం చేసుకోరాద‌న్న ఎన్నిక‌ల క‌మీష‌న్ ఆకాంక్ష‌ల మేర‌కు అబ్కారీ శాఖ గోడ ప‌త్రిక‌ల‌ను రూపొందించింద‌న్నారు.  క‌ల్తీ, ప‌న్ను చెల్లించ‌ని, ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన అక్ర‌మ మ‌ధ్యం, అన‌ధికార మ‌ధ్యం విక్ర‌యాలు (బెల్ట్‌), నాటు సారా, గంజాయి, ఇత‌ర మాద‌క ద్ర‌వ్యాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని తెలియ ప‌రిచిన మ‌రుక్ష‌ణం త‌మ బృందాలు రంగంలోకి దిగేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఎన్నికల ప్ర‌ధాన అధికారికి మీనా వివ‌రించారు. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను సైతం అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌న్న మీనా దానిని గోపాల‌కృష్ణ  ద్వివేదితోనే విడుద‌ల చేయించారు. అనంత‌రం త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మీనా మాట్లాడుతూ అబ్కారీ శాఖకు సంబంధించిన ఏ పిర్యాధునైనా 1800-425-4868 నెంబ‌ర్‌కు తెలియచేయ‌వ‌చ్చ‌న్నారు. ల్యాండ్‌లైన్ నెంబ‌ర్‌ను సైతం అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌ని, 0866-2428333 నెంబ‌ర్ ద్వారా కూడా స‌మాచారాన్ని తీసుకుంటామ‌ని తెలిపారు. స‌మాచారం తెలిపిన వారి వివ‌రాలు గోప్యంగా ఉంచి, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో చ‌ర్య‌లు తీసుకుని, ఆ స‌మాచారాన్ని సైతం వారికి తెలియ చేస్తామ‌ని ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. కంట్రోల్ రూమ్ ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌ని రానున్న రెండు మూడు రోజుల్లో దానిని ప్రారంభిస్తామ‌ని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో అబ్కారీ శాఖ అద‌న‌పు క‌మీష‌న‌ర్ కెఎల్ భాస్క‌ర్‌, విజ‌య‌వాడ అబ్కారీ సూప‌రిండెంట్ ర‌మ‌ణ‌మూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Just In...