Published On: Mon, Nov 16th, 2020

ఎన్‌.ఎం.ఆర్‌.ల వేత‌నాల పెంపుపై త్వ‌ర‌లో నిర్ణ‌యం

* కృష్ణా క‌లెక్ట‌ర్ ఏ.ఎండి.ఇంతియాజ్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కృష్ణాజిల్లాలో వివిధ రంగాలలో పనిచేస్తున్న ఎన్.యం.ఆర్.ల ప్రస్తుత ఆర్ధిక సంవత్సరపు వేతనాలు పెంపు నిర్ధారణకు సంబంధించి త్వరలోనే నిర్ణయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. స్థానిక కలెక్టర్‌ ఛాంబరులో సోమవారం కార్మికశాఖ ఆధ్వర్యంలో సమన్వయ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నైపుణ్య, నైపుణ్యేతర విభాగాల్లో వివిధ శాఖల, రంగాల ఆధ్వర్యంలో పనిచేసే యన్.యం.ఆర్‌ వేతనాలను నిర్ధారణకు సంబంధించి నిర్దిష్ట యయస్ఆర్‌ల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి కార్మికశాఖ ఆయా శాఖల ఆధ్వర్యంలో పనిచేసే యన్ యంఆర్ సామర్ధ్యాన్ని, పనితీరు పై సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి యూనియన్లతో కూడా సమావేశం నిర్వహించి వివరాలను సేకరించాలని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. కనీస వేతనాల పెంపునకు సంబంధించి వివిధ జిల్లాల్లో అమలుచేస్తున్న వేతనాలను, యయస్ఆర్ల మేరకు నివేదికను రూపొందించాలని కలెక్టరు పేర్కొన్నారు. రెండు రోజుల్లో నివేదికలతో హాజరు కావాలని కలెక్టరు స్పష్టం చేశారు. సమావేశంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ సిహెచ్.ఆశారాణి, ఇరిగేషన్ ఎస్‌.ఈ.కె.నరసింహమూర్తి, ఏపి ట్రాన్స్‌కో ఎస్‌.ఇ.ఎన్‌. శ్యామ్యూల్ రాజు, వీయంసి ఎస్‌.ఇ.బి.నరసింహమూర్తి, ఆర్అండ్‌బి ఈఈ సీహెచ్‌వి సుబ్బయ్య పాల్గొన్నారు.

Just In...