Published On: Tue, Dec 4th, 2018

ఎపిఎస్ఎఫ్‌టివిటిడిసిలో స్వ‌ల్ప‌కాలిక కోర్సుల‌కు ప్ర‌వేశం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఏపీ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ సంయుక్తంగా స్వల్ప కాలిక కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తోందని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిలిం మరియు టీవీ ఫీల్డ్ నందు షార్ట్ ఫౌండేషన్ కోర్సులకు 18 సంవత్సరాలు మరియు ఆపైన వయస్సు గల ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. యాక్టింగ్, స్ర్కీన్ ప్లే, స్క్రిప్ట్ రైటింగ్, స్మార్ట్ ఫోన్ ఫిల్మ్ రైటింగ్, క్రిటిక్ తదితర కోర్సుల దరఖాస్తు దాఖలుకు చివరి తేది డిసెంబర్ 15గా నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. తదుపరి వివరాలకు www.apsftvtdc.in వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వెంకటేశ్వర్ తెలిపారు.

Just In...