Published On: Sat, Sep 14th, 2019

ఎపి జుడీషియల్ ప్రివ్యూ కమిటీ అధ్యక్షునిగా..

జస్టిస్ బి.శివశంకర్ రావు బాధ్యతలు స్వీకరణ…

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ గా జస్టిస్ బి. శివశంకర్ రావు బాధ్యతలు చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎపి జుడీషియల్ ప్రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి దానికి జస్టిస్ శివశంకర్ రావును అధ్యక్షునిగా నియమించగా శనివారం అమరావతి సచివాలయంలోని రెండవ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.జస్టిస్ శివశంకర్ రావు తెలంగాణా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.ఈసందర్భంగా జస్టిస్ శివశంకర్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రప్రధమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్ ప్రివ్యూ కమిటీని ఏర్పాటు చేయడం దానికి తనను తొలి అధ్యక్షునిగా నియిమించి రాష్ట్రానికి సేవలందించే అవకాశం భగవంతుడు కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. జుడీషియల్ ప్రివ్యూ కమిటీ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను పారదర్శకంగా మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళుతూ పర్యావరణ పరిరక్షణను కాపాడుతూ సకాలంలో పూర్తయ్యేలా తన వంతు కృషి చేస్తానన్ని జస్టిస్ శివశంకర్ రావు పేర్కొన్నారు.ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా ప్రతి పైశా సద్వినియోగం అయ్యే విధంగా ఈచట్టాన్ని అనుసరించి నావిధులను సక్రమంగా నిర్వహించి వివిధ ప్రాజెక్టులు పారదర్శకంగా సకాలంలో పూర్తయ్యే విధంగా తనవంతు బాధ్యతలు నిర్వహిస్తాని పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే భారతదేశ సంస్కృతి అత్యుత్తమమైన సంస్కృతని మిగతా జీవులు కంటే మానవులుగా పుట్టిన మనం సమాజానికి ఎక్కువ మంచిసేవలు అందిస్తామని భగవంతుడు మనల్ని మనుషులుగా పుట్టించాడని కావున ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను సక్రమంగా నెవేర్చే ప్రయత్నం చేయాలని ఆయన హితవు చేశారు.భారతదేశ రాజ్యాంగంలోని 51 ఎ నిబంధన మనకు కల్పించిన హక్కులు గురించి తెలియజేస్తోందని హక్కులతోపాటు ప్రతి పౌరుడు వారి బాధ్యతలను గురించి కూడా తెల్సుకుని వాటిని సక్రమంగా నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఉందని జస్టిస్ శివశంకర్ రావు స్పష్టం చేశారు. అంతకు ముందు విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన వేదపడింతులు జస్టిస్ శివశంకర్ రావుకు ఆశిస్సులు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమీషనర్ సిద్ధార్ధ జైన్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, న్యాయశాఖ కార్యదర్శి మనహోర్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Just In...