Published On: Tue, Aug 13th, 2019

ఎమ్మెల్యే రోజా ఇంటికి సీఎం కేసీఆర్‌..

ఎమ్మెల్యే రోజా ఇంటికి సీఎం కేసీఆర్‌..

సెల్ఐటి న్యూస్, నగరి (చిత్తూరు జిల్లా): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి సోమవారం వెళ్లారు. తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజ స్వామిని దర్శించుకొని తిరిగి వస్తూ మార్గమధ్యంలోని నగరిలో ఆగారు. తన సతీమణి శోభ, కుమార్తె కవితతో కలిసి రోజా నివాసానికి కేసీఆర్‌ వెళ్లారు. ఆయన వెంట ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి తదితరులు ఉన్నారు. అంతకుముందు, తమిళనాడులోని కాంచీపురంలో సీఎం కేసీఆర్‌ అత్తివరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత  హైదరాబాద్‌ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు నగరిలో రోజా స్వాగతం పలికారు. అనంతరం ఆమె కూడా సీఎం కుటుంబ సభ్యులతో కలిసి కాంచీపురానికి వెళ్లారు. తిరిగి తిరుమలేశుని దర్శించుకొనేందుకు వస్తూ మార్గమధ్యంలో రోజా ఇంటికి సీఎం కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.

Just In...