Published On: Mon, Apr 15th, 2019

ఎమ్మెల్సీగా దువ్వారపు రామారావు ప్రమాణస్వీకారం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: శాసనమండలి సభ్యునిగా దువ్వారపు రామారావు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న బీఏసీ సమావేశపు హాలులో శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ఎమ్మెల్సీగా ఆయన చేత సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. శాసన సభ్యుల కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. ప్రమాణస్వీకారం అనంతరం ఎమ్మెల్సీ దువ్వారపు రామారావును మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ తదితరులు అభినందించారు.

Just In...