Published On: Mon, Apr 15th, 2019

ఎమ్మెల్సీగా మంత్రి యనమల ప్రమాణస్వీకారం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: శాసనమండలి సభ్యునిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న తన కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్… మంత్రి యనమల రామకృష్ణుడు చేత ఎమ్మెల్సీగా సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. 2013లో ఎమ్మెల్సీగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బాధ్యతలు చేపట్టారు. గత నెల 31వ తేదీతో ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం పూర్తైంది. శాసనసభ్యుల కోటాలో మరోసారి మంత్రి యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Just In...