Published On: Sat, Feb 16th, 2019

ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. శాసన మండలి ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణరావుకు ఆయన తన రాజీనామా లేఖని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసనసభకు పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మంత్రి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు.
 

Just In...