ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన అవసరం..
విజయవాడ, సెల్న్యూస్: ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పి.బి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మంగళవారం ఉదయం కృష్ణా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్వరాజ్యమైదానంలో నిర్వహించిన ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీలో కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్లు పాల్గొన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి స్వరాజ్యమైదానం వరకు ప్రజలకు అవగాహన కోసం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాల వెబినార్ హాలు నందు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం సమన్వయకర్త పెదపూడి సుభాకర్, డి.శ్రీనివాసరెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన అవసరం అని, సమాజానికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ మరియు ఇతర కార్య్రమాలను నిర్వహించిన వాలంటీర్లను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ రాజేష్ సి జంపాల అభినందించారు.