Published On: Sat, Jul 4th, 2020

ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో ఏపీకి తిరుగులేదు

* మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమ‌రావ‌తి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. లాక్ డౌన్ అనంతరం అన్ని జాగ్నత్తలతో స్వేచ్ఛగా పరిశ్రమలను పున:ప్రారంభించాం. కరోనా విపత్తు విజృంభిస్తున్నా ‘రీస్టార్ట్ ప్యాకేజ్’తో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సాయంలో ఏపీదే తొలిస్థానం. వృద్ధికి అవకాశాలున్న రంగాలను అంచనా వేసి పెట్టుబడుల ఆకర్షణకు నిరంతరం కృషి చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ పారిశ్రామిక ప్రగతికి కీలకమైన విద్య, నైపుణ్యాలకూ పెద్దపీట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ బెస్ట్. వాణిజ్యానికి అయ్యే ఖర్చు పొదుపు, నియంత్రణలను పాటిస్తూ ‘కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లోనూ మరింత స్ఫూర్తిగా నిలబడతాం. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు కావల్సిన ఫ్రీ ల్యాండ్, నీరు, విద్యుత్, నైపుణ్య శిక్షణ ఉన్న మానవవనరులకు ప్రభుత్వం హామీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తరపున సుపరిపాలనే మరో బలం. ఇండియన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అసోసియేషన్, ఏపీ ఈడీబీ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్ లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణకు, అనుమతుల వేగంవంటి విషయాల్లో ప్రభుత్వ కృషిని వివరించిన కరికాల వలవన్. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ తయారీ రంగం, ఆ రంగం పాలసీ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి అంశాలను వివరించిన ఏపీ ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్, నీరు, లేబర్ కాస్ట్ ఇలా అన్ని విషయాల్లో ఏపీ బెస్ట్ అన్న ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్. వెబినార్‌లో పాల్గొన్న పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Just In...