Published On: Mon, Jan 13th, 2020

ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి పృథ్వీ రాజీనామా

* ప్రెస్‌మీట్‌లో చెప్పు తీసి పృథ్వీ భావోద్వేగం

హైదరాబాద్, సెల్ఐటి న్యూస్‌: ఆడియో టేప్ వ్యవహారం బట్టబయలు కావడంతో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి సినీ నటుడు పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. పదవికి రాజీనామా అనంతరం ఆదివారం సాయంత్రం పృథ్వీరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ… తనను దెబ్బతీసేందుకు కొంతమంది అనేక రకాలుగా ప్రయత్నించారని ఆరోపించారు. ఫేక్‌ వాయిస్‌తో తనపై దుష్ప్రచారం చేశారని, తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీబీసీ ఉద్యోగులతో స్నేహంగా ఉంటానని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మందు తాగానని దుష్ప్రచారం చేశారని తెలిపారు. తనకు మ‌ద్యం తాగే అలవాటు లేదని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో తాగానని నిరూపితమైతే ఈ చెప్పుతో కొట్టండని తన కాలికి ఉన్న చెప్పును తీసి మీడియా మైకుల ముందు పృథ్వీ పెట్టడంతో మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. తాను తాగలేదని, ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని పృథ్వీ ప్రకటించాడు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని, తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఖండించానని పృథ్వీ చెప్పుకొచ్చారు.

Just In...