Published On: Sat, Oct 17th, 2020

ఎస్.బి.ఐ. అమరావతి సర్కిల్ భారీ విరాళం..

* రూ.23 లక్షలు విలువైన బస్సు దేవస్థానానికి అందజేత
ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి అమ్మవారి దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం
బస్సును అందజేయడం జరిగిందిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ పి.శివకుమార్ తెలిపారు. శనివారం దుర్గమ్మ దేవస్థానం చైర్మన్, కార్యనిర్వాహణాధికారికి ఇంద్రకీలాధ్రిపై ఎస్.బి.ఐ. అధికారులు వాహనాన్ని అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం 27 సీట్లు గల మినీ బస్సును అందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ మహత్కార్యంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా హైదరాబాదు నుండి చీప్ జనరల్ మేనేజరు సంజయ సహాయ్ ఈ బస్సును విరాళంగా దేవస్థానానికి అందజేశారు. డీజీఎం వై.సత్యనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి సేవలో భాగస్వామ్యమవ్వడం పట్ల సంతషంగా ఉందన్నారు.
దేవస్థానం బోర్డు సభ్యులు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎస్‌బిఐ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని స్థానిక ఎస్.బి.ఐ. గాంధీనగర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. దేవస్థానం ఛైర్మన్ పైలా స్వామినాయుడు, కార్యనిర్వాహణాధికారి యం.సురేష్‌బాబు దేవస్థానం తరపున ఎస్.బి.ఐ. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 27 సీట్ల మినీ బస్సు భక్తులకు ఎంతో సహాయంగా నిలుస్తుందన్నారు.  మూలధనం నిధి కింద బస్ దేవస్థానం భక్తులకు సేవలందిస్తుందని వారు తెలిపారు. అనంతరం ఇంద్రకీలాంద్రిపై గాంధినగర్ బ్రాంచ్  రీజనల్ మేనేజర్ పి.శివకుమార్ నేతృత్వంలో జీఎం, డిజియంలు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వర్ణకవచాలంకృత  కనక దర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శంచుకున్నారు.

Just In...