ఏపి ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ డైరీ ఆవిష్కరణ
గుంటూరు, సెల్ఐటి న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ తరఫున ముద్రించిన 2021 నూతన సంవత్సరం డైరీని బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో హోంశాఖ మంత్రి మేకతోటి సూచరిత చేతులు మీదుగా ఆవిష్కరించారు. యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మనోలేఖ పక్ష పత్రిక సాగర్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పబ్బరాజు నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి కె.కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.