Published On: Sat, Nov 21st, 2020

ఏపి జర్నలిస్టులకు ఆన్‌లైన్ శిక్షణ తరగతులు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: జర్నలిజం అనేది వృత్తి అని భావించే వారు తప్పనిసరిగా నైపుణ్యం, నిబద్ధత పెంపొందించుకోవాలని  ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పిలుపునిచ్చారు. శనివారం ప్రెస్ అకాడమీ కేంద్ర కార్యాలయం నుండి ప్రకాశం జిల్లా జర్నలిస్ట్  ఆన్‌లైన్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వృత్తి జర్నలిస్ట్ నిరంతర విద్యార్థి అని సమకాలీన రాజకీయ,సామాజిక విషయాలపై అవగాహన చేసుకుంటూ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని కోరారు.గ్రామీణ,పట్టణ ప్రాంతాల జర్నలిస్ట్ లకు సంబంధించి నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ చర్యలు చేపడుతుందని వాటిని  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెడుకి దూరంగా ఉంటూ భాద్యతాయుతంగా నిజాలు నిర్ధారించుకుని సమాచారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ వృత్తిలో మార్పు లేకపోతే ఎదుగుదల ఉండదని దాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థి తరహాలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. జర్నలిజం విలువలను కాపాడుకుంటూ జర్నలిస్ట్‌లు వృత్తి రీత్యా  మరింత ఎదగాలని సూచించారు. సరైన సమాచారం ఇవ్వాలని, ప్రజలను మెప్పించాలని తెలిపారు. వర్చువల్ ఆన్‌లైన్ శిక్షణ తరగతులను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్.వి.కే.రెడ్డి సమన్వయం చేశారు. శిక్షణ తరగతుల్లో సీనీయర్ పాత్రికేయులు దిలీప్ రెడ్డి, బివి ప్రసాద్  ప్రకాశం జిల్లా వృత్తి జర్నలిస్ట్‌లకు సంబంధించి నైపుణ్యాలు పెంపొందించేందుకు, అవగాహన, భాషపై పట్టు, క్షేత్ర స్థాయిలో స్వీయ అవగాహన పెంచుకుంటూ  వాస్తవాలను తెలుసుకుని యదార్థ విషయాల్లో ప్రత్యక్షంగా వుంటూ పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని దిలీప్ రెడీ సూచించారు. వార్తలు రాసేవారు లెక్కలు, గణాంకాలు, పూర్తిగా తెలుసుకుని నిర్దిష్టంగా వార్త రాస్తే విశ్వసనీయత ఉంటుందన్నారు. అందుకు కృషి అవసరం అనేదాన్ని గుర్తించాలి అని సూచించారు. డేటా అనేది జర్నలిస్టులకు సర్వైవల్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. రొటీన్‌గా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తూ సమకాలీన అంశాలను అధ్యయనం చేసుకుంటూ సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు. సంప్రదాయబద్దంగా కాకుండా ప్రతి జర్నలిస్ట్ విభిన్నంగా విశ్లేషిస్తూ ప్రగతి శీల జర్నలిజానికి శ్రీ కారం చుట్టాలన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల నైతిక విలువలు పెంపొందించుకోవాలని అందుకు కావాల్సిన అంశాలపై  సీనియర్ పాత్రికేయులు బివి ప్రసాద్ సూచించారు. కార్య క్రమాన్ని ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర తిలక్ పర్యవేక్షించారు.

Just In...