Published On: Wed, Sep 18th, 2019

ఏపి మాజీ స్పీక‌ర్ కోడెల విగ్ర‌హం త‌యారు

సెల్ఐటి న్యూస్‌, త‌ణుకు: తణుకు దగ్గర నత్త రామేశ్వ‌రంలో కోడెల విగ్రహం తయారుచేస్తున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందిన వార్త తెలుసుకున్న ఏకే ఆర్ట్స్ సంస్ధ అధినేత అరుణ్‌ప్రసాద్ ఉడయార్ కోడెలకు నివాళులర్పించారు.ఈ సంద‌ర్భంగా కోడెల విగ్రహాన్ని తయారుచేసి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఇదే సంస్ధ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని తార‌కరామా సాగర్‌లో ఉన్న 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారుచేసింది కూడా ఈ సంస్ధ నిర్వాహకులే. కోడెల విగ్ర‌హం దాదాపుగా పూర్తైంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

Just In...