Published On: Wed, Jun 12th, 2019

ఏపీఎస్‌ ఆర్టీసీని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతా

* ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలతో ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌

* సమ్మె యోచన విరమిస్తున్నట్టు నేతల ప్రకటన

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతల భేటీ ముగిసింది. బుధ‌వారం శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంపై కమిటీ వేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఐకాస నేతలు మీడియాతో మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించడంతో సమ్మె యోచన విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్న అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కార్మికులకు సమస్యలు లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నష్టాలపై ప్రస్తావించిన కార్మికులను ముఖ్యమంత్రి జగన్‌ సముదాయించారు. ఆర్టీసీ సమస్యలు ఇక ప్రభుత్వ బాధ్యత అని కార్మికులతో చెప్పారు. ఇక మీరంతా ప్రభుత్వ ఉద్యోగులని కార్మికులతో సంబోధించారు. ఆర్టీసీని ఆధునీకరిస్తామని కార్మిక సంఘాలకు జగన్‌ హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే ఆర్టీసీని అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దుతానన్నారు.

Just In...