Published On: Wed, Oct 14th, 2020

ఏపీఐఐసీ భూముల‌ను అభివృద్ధి చేయండి

* జోనల్ మేనేజర్ మురళీకృష్ణకు మంత్రి కొడాలి నాని సూచ‌న‌

గుడివాడ, సెల్ఐటి న్యూస్‌: ఏపీఐఐసీకి చెందిన భూముల‌ను అభివృద్ధి చేయాల‌ని జోనల్ మేనేజర్ మురళీకృష్ణకు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. బుధవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని నివాసంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలోని ఆటోనగర్‌లో ఏపీఐఐసీకి చెందిన భూములు ఉన్నాయని, వాటిని పరిశీలించేందుకు వచ్చినట్లు మురళీకృష్ణ తెలిపారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఆటోనగర్ లోని ఏపీఐఐసీకి చెందిన భూములున్న ప్రాంతం లోతట్టు ప్రాంతంగా ఉందని, మెర‌క చేస్తే వాహనాల పార్కింగ్ వంటి సమస్యలు ఉండవన్నారు. అలాగే రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ముందుగా మంత్రి కొడాలి నానికి జోనల్ మేనేజర్ మురళీకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Just In...