Published On: Fri, Jun 14th, 2019

ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను అమిత్ షాకు వివరించా

* కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అనంత‌రం ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి

* నేడు నీతి ఆయోగ్ స‌మావేశంలో పాల్గొన‌నున్న సీఎం జ‌గ‌న్‌

* డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విపై అస‌త్య ప్ర‌చారం చేయోద్దు అని జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకత, విభజన చట్టంలోని అంశాలను ఆయనకు వివరించినట్టు తెలిపారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలుపుతూ ఓ లేఖను అమిత్‌షాకు అందజేశామని వెల్లడించారు. శనివారం జరగబోయే నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతానని సీఎం స్పష్టంచేశారు. దేవుడి దయతో హోదా వచ్చేవరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని స్పష్టంచేశారు. విభజన హామీలు త్వరగా పరిష్కరించాలని కోరినట్టు చెప్పారు. వైకాపాకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపాదన ఏమీ రాలేదని, అలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని జగన్‌ విజ్ఞప్తి చేశారు. శ‌నివారం జరిగే వైకాపా పార్లమెటరీ పార్టీ భేటీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి,. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో జగన్‌ పాల్గొంటారు. నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ప్రత్యేక హోదా అంశంపై వివరించేందుకు ఇప్పటికే నివేదిక సిద్ధం చేయించారు.

Just In...