Published On: Mon, Sep 14th, 2020

ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు

* ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

విశాఖప‌ట్నం, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ రెండు ముక్కలు చేయడం దారుణమన్నారు.
రాష్ట్రంలో అసమర్ధ, అరాచక పాలన సాగుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న రాజధానిని ఏర్పాటు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వరసగా శిరోముండనం ఘటనలు జరగడం బాధకరమని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

Just In...